బాలీవుడ్ సినిమా అంటున్న ప్రభాస్..?

వాస్తవం సినిమా: బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ సపరేట్ మార్క్ మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. దీంతో బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ సాహో సౌత్ ఇండస్ట్రీలో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఆదరణ దక్కించుకుంది.

ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తర్వాత మళ్లీ బాలీవుడ్ సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ప్రభాస్ కోసం కరణ్ ఒక మంచి స్టోరీ సిద్ధం చేసారని, వాస్తవానికి ఆ కథ తాలూకు మెయిన్ థీమ్ ఎప్పుడో సిద్ధం అయిందని, అయితే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అవడానికి కొంత టైం తీసుకున్న కరణ్, ఎట్టకేలకు దానిని పూర్తి చేసి, త్వరలో ప్రభాస్ ని కలిసి స్టోరీ ఫైనలైజ్ చేయనున్నట్లు టాక్.

అంతేకాక ప్రభాస్ కూడా కరణ్ తో ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో ఎంతో మక్కువగా ఉన్నారని, దీనిని బట్టి ప్రభాస్ తొలిసారి బాలీవుడ్ లో నటించబోయే సినిమా ఖాయమైనట్లేనని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు గాని కచ్చితంగా మాత్రం ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్ట్రైట్ మూవీ చేస్తున్నట్లు వార్తలు చాలా గట్టిగా వినపడుతున్నాయి.