గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయిన మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌

వాస్తవం ప్రతినిధి: కేంద్ర ఇంధన, రసాయన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఈరోజు ఉదయం అమరావతి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ నాయకులు మాణిక్యాలరావు, ఇతర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్‌ మంత్రిని కోరారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం పరిధిలో గ్యాస్‌ నిక్షేపాలు వెలికి తీసే ప్రాంతాన ఏర్పాటుచేసిన ఫిల్లింగ్‌ స్టేషన్‌ను ఈరోజు ధర్మేంద్ర ప్రదాన్‌ ప్రారంభించనున్నారు.

అలాగే శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, జాయింట్‌ కలెక్టర్‌-2 ఆర్‌.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జలవనరుల శాఖ ఎస్‌ఇ లు బి.రాంబాబు, పి.రంగారావు, డిఎఫ్‌ఓ సందీప్‌ కఅపాకర్‌, ఆర్డీవో లు, జలవనరుల శాఖ ఇఇ లు, ఎస్డీసి లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.