పారిశ్రామిక రంగంలో కొత్త అడుగులు వేస్తున్న ఏపీ సర్కార్…!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన రాష్ట్రం అని, ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో పద్ధతి ద్వారా అనుమతి ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీగా ఉందని మంత్రులు గౌతంరెడ్డి, అవంతి శ్రీనివాస్ లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న విశాఖనగరం పర్యాటకంగా…ఆర్థికంగా పెట్టుబడులకి అవకాశమన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఒక సదస్సులో భాగంగా పోర్టుల అభివృద్ధి, ఉత్పత్తి పెంపు, పెట్టుబడి అవకాశాలు, స్వేచ్ఛా వాణిజ్య అభివృద్ధి, టూరిజం అభివృద్ధి, సెక్యూరిటీ,సేఫ్టీ కి సంబంధించిన అంశాలపై ఏడు దేశాల ప్రతినిధులు చర్చించారు. బంగాళాఖాతం అనుకుని ఉన్న దేశాల మధ్య బహుళ రంగాలు, సాంకేతిక, ఆర్థిక క రంగాల సమన్వయంపై ఈ సదస్సు చర్చకు వేదికగా మారింది. 1997 లో బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ లు సభ్య దేశాలుగా బిమ్స్‌ టెక్ ప్రారంభమైంది. బిమ్స్ టెక్ ప్రారంభమైన 32 సంవత్సరాల తర్వాత తొలిసారి విశాఖ పోర్టు ఇందుకు ఆతిథ్య మిస్తోంది. ఈ కార్యక్రమంలో వైసిపి పార్టీ అధికార నేతలు మరియు ఏడు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.