తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు ఆపసోపాలు..?

వాస్తవం ప్రతినిధి: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీని చాలా విజయవంతంగా అద్భుతంగా ముందుకు నడిపించిన టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా 2019 ఎన్నికల్లో రాజకీయంగా జగన్ కొట్టిన దెబ్బకు కోలుకోలేని స్థితిలోకి చంద్రబాబు వెళ్లిపోయినట్లు వచ్చిన ఫలితాలను బట్టి అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే వయసు మీద పడటం తో మరోపక్క కొడుకు వయసు కలిగి మంచి కుర్ర రక్తంతో ప్రజా పరిపాలన అందిస్తున్న సంక్షేమాలు అద్భుతంగా అమలుచేస్తున్న జగన్ ని ఢీ కొట్టడానికి తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నట్లు సమాచారం.

నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించడం కోసం చంద్రబాబు వెతుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకువస్తే బాగుంటుందని చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సలహాలు ఇస్తున్నా, వాటిని పక్కన పెట్టి చంద్రబాబు సరైన నాయకుడిని పార్టీకి అధ్యక్షుడిగా నియమించడానికి వెతుకుతున్నట్లు టీడీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.