పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన జగన్..?

వాస్తవం ప్రతినిధి: వైసిపి పార్టీ అధినేత జగన్ ని టార్గెట్ చేసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల నాటి నుండి దారుణమైన కామెంట్లు చేస్తూనే వస్తున్నారు. చంద్రబాబుకి పరోక్షంగా మద్దతు ఇస్తూ జగన్ పై కామెంట్ చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ అప్పట్లో 2014 ఎన్నికల్లో ఓడిపోయి జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ నే విమర్శించిన పవన్ కళ్యాణ్ అప్పట్లో పలు అవినీతి ఆరోపణలు వచ్చి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఏ మాత్రం కూడా విమర్శించకుండా ఉండటం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

దీంతో పరోక్షంగా చంద్రబాబు మద్దతు పవన్ కళ్యాణ్ కి ఉందని ఇద్దరి మధ్య ప్యాకేజీ ఒప్పందం కుదిరిందని అందువలన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ ఒకరిని ఒకరు విమర్శించుకొన్న రోజులు లేవు అని అప్పట్లో ఏపీ రాజకీయాల్లో వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం అధికారంలోకి జగన్ వచ్చాక ప్ర జలకు మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తుండగా…కూడా పవన్ కళ్యాణ్ జగన్ ని బండ బూతులు తిట్టడంతో దారుణమైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో..

.పవన్ కళ్యాణ్ ని పెద్దగా అప్పట్లో జగన్ పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ విమర్శలు తారాస్థాయికి చేస్తున్న నేపథ్యంలో…పవన్ కళ్యాణ్ ని జగన్ టార్గెట్ చేసినట్లు ఏపీ రాజకీయాల వార్తలు వస్తున్నాయి. ప్రజలు గెలిపించిన వైసీపీ ప్రభుత్వాన్ని మీరంతా మీ బతుకెంత అంటూ ప్రజాస్వామ్యం ఇచ్చిన తీర్పుని అవహేళన చేస్తూ పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం పట్ల జగన్ సీరియస్ అయినట్లు దీంతో పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఒంటరి చేయటానికి జగన్ సరైన స్కెచ్ వేసినట్లు సమాచారం.

ఇందుమూలంగా జనసేన పార్టీకి అండగా ఉన్న లెఫ్ట్ పార్టీలను తనవైపు తిప్పుకునే కార్యక్రమానికి జగన్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్లనే ఇటీవల సీఎం జగన్ స్వయంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధును మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న సందర్భంలో కలుసుకున్నట్లు తెలుస్తుంది.