పూర్తిగా మద్యపానాన్ని నిషేధించే ఆలోచనలో ఏపీ సీఎం జగన్..?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో మార్పును తీసుకువచ్చే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో 2014 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఆ తర్వాత ఎక్కడపడితే అక్కడ రాష్ట్రంలో బెల్టుషాపులు వచ్చే విధంగా ఇంటికి డోర్ డెలివరీ అయ్యేవిధంగా మద్యపానం విషయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు వ్యవహరించారు.

అయితే మరోపక్క ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రలో చాలా మంది మహిళలు తమ భర్తలు మద్యపానానికి బానిసలవుతున్నారు అంటూ జగన్ దగ్గర తమ బాధలు చెప్పుకొని ఇలానే రాబోయే రోజులు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని జగన్ కి తెలియజేయడంతో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా మద్యపానాన్ని క్రమక్రమంగా నిషేధించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది.

అయితే ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన జగన్ గ్రామాలలో బెల్టుషాపులు లేకుండా పూర్తిగా మూసివేసే విధంగా ఆదేశించారు.. ఆ తర్వాత బ్రాందీ షాపులు మిగతావన్నీ ప్రభుత్వమే నడిపే విధంగా తీసుకువచ్చారు. కేవలం పొద్దున నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం దొరికేలా సమయాన్ని కేటాయించారు. ఇలా ఉండగా తాజాగా ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయిన జగన్ సిటీలో ఉండే బార్ షాపులను కూడా తగ్గించడానికి కృషి చేసినట్లు..జనవరి నుండి అమలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరియు అదే విధంగా ప్రజలు తిరిగే చోట్ల ఎట్టి పరిస్థితుల్లో బార్ షాప్ ఉండకూడదని అనుమతులు ఇవ్వకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే జగన్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.