బిజెపి లోకి వెళ్లిపోతున్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు..?

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా పట్టు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆంధ్రాలో కూడా అదే స్థితికి దిగజారుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి చాలా మంది సీనియర్ నాయకులు ఇతర పార్టీల్లోకి జంప్ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో బలమైన తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా త్వరలో పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే గంటా శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఆయనతో కలిసి మరి కొంత మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా బిజెపి లోకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే మీడియా చానల్స్ కూడా చెబుతున్నాయి. ఇటీవల బిజెపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్ తో గంటా శ్రీనివాస రావు భేటీ అయినట్లు లైను మొత్తం క్లియర్ అయినట్లు టైం తీసుకుని గంటా శ్రీనివాసరావు బిజెపి పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందు మూలంగానే తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు పాల్గొనకుండా గంటా శ్రీనివాసరావు గత కొంత కాలం నుండి మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు ని పాల్గొనాలని చంద్రబాబు తెలియజేసిన గాని…బాబు ఆదేశాలు బేఖాతరు చేస్తూ పాల్గొనకపోవడం బట్టి చూస్తే గంటా శ్రీనివాస్ త్వరలోనే బిజెపి పార్టీలోకి వెళ్తున్నట్లు అర్థమవుతుంది.