వంగవీటి రాధా పై సెటైర్లు..వెంటనే సారీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

వాస్తవం ప్రతినిధి: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా వివాదస్పదమైన సినిమాలు చేస్తూ పొలిటికల్ గా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగు రాజకీయాలలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో కలకలం సృష్టించిన రాంగోపాల్ వర్మ తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రగడ సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఏపీ రాజకీయాలను అనేక వివాదాలకు దారి తీస్తున్న క్రమంలో తాజాగా..

రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఎకౌంట్లో వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధా పై సెటైర్లు వేసి వెంటనే సారీ చెప్పాడు. క్లియర్ కట్ గా విషయంలోకి వెళితే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా లో ఇప్పటికే చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వంటి పాత్రల గురించి ఫోటో లు పెడుతూ సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ…తాజాగా సినిమాలో వంగవీటి రాధా పాత్ర ఇదే అంటూ ఓ ఫోటో పోస్ట్ చేశాడు. సిట్ అధికారి సుందరి వంగవీటి రాధాని విచారణ చేస్తున్నారు.. సారీ సారీ వంగవీటి కాదు.. గంగవీటి భవాని.. కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో ఓ దృశ్యం అని వర్మ ట్వీట్ చేశాడు. దీంతో రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.