విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతి..? 

వాస్తవం ప్రతినిధి: రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతిచెందినట్టు సమాచారం. విజయారెడ్డిని చంపే క్రమంలో సురేష్ ఒంటికి కూడా నిప్పు అంటుకుంది. దాదాపు 60శాతం కాలిన గాయాలైన అతడు అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు..పోలీసులు నిందితుడు సురేష్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తాజాగా గురువారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ చనిపోయినట్టు తెలిసింది. ఈ మేరకు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోలీసులు సురేష్ కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారం అందించినట్టు తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.