‘కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్ “..యువ క్రికెటర్లు అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో యువ క్రికెటర్లు సీఎం గౌతమ్, అబ్రార్ కాజి‌లను బెంగుళూరు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ లీగ్‌లో బళ్ళారి టస్కర్స్, హుబ్లీ టైగర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది.

‘కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్ జరిగిందని.. ప్రస్తుతం గౌతమ్, కాజిలను అరెస్ట్ చేశామని సీబీఐ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు. లీగ్‌లో మరిన్ని మ్యాచ్‌ల్లో కూడా ఫిక్సింగ్ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ జరుపుతున్నాం.. త్వరలోనే మరి కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని’ ఆయన అన్నారు. ది.