నేడు భారత్- బంగ్లాదేశ్ మధ్య రెండో టి20

వాస్తవం ప్రతినిధి: భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండో టి20 నేడు జరగనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి టి20లో విజయం సాధించిన బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. సిరీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలి. అయితే ‘మహా’ తుపాన్ ప్రభావం మ్యాచ్ పై పడే అవకాశాలు ఉన్నాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి మైదానం తడిసి ముద్దైంది. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి.