కర్నూలు జిల్లా లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను అడ్డుకొన్న గ్రామస్తులు

వాస్తవం ప్రతినిధి: భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్  ను కర్నూల్ లో  . శ్రీశైలం ముంపు బాధితులు మంత్రి కాళ్లు మొక్కుతు.. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు .శ్రీశైలం ప్రాజెక్టు పుణ్యాన సర్వం కోల్పోయిన తాము నలభై ఏళ్లుగా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామని, తమకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ముంపు బాధిత నిరుద్యోగులు   అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు మొరపెట్టుకున్నారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జునస్వాముల దర్శనార్థం వచ్చిన మంత్రి కర్నూల్‌లో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా దారి మధ్యలో నిరుద్యోగులు ఆయన కాన్వాయిని అడ్డుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ 60 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించని విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమ గోడు విని న్యాయం చేయాలని ఆయనకు వినతిపత్రం అందించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని తెలిపారు.

 

 

 

కర్నూలు జిల్లా నందికొట్కూరులో బాధితులు ఆందోళనకు దిగారు. ముంపు బాధితులు భారీగా తరలి రావటంతో… పోలీసులతో తోపులాట జరగటంతో ఉద్రికత్త నెలకొంది. మంత్రి అనిల్… ఈ విషయంపై న్యాయం చేస్తామని హమీ ఇవ్వటంతో ముంపు బాధితులు ఆందోళన విరమించారు.