గొల్లపూడిని పరామర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

వాస్తవం ప్రతినిధి: సీనియర్ రైటర్ నటుడు గొల్లపూడి మారుతీరావు ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావును ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. భారతదేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా చెన్నై కి వచ్చిన వెంకయ్య నాయుడు గొల్లపూడి మారుతీరావు విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వచ్చి పరామర్శించి అయన ఆరోగ్యం గురించి డాక్టర్స్ ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు.

కాగా గొల్లపూడి ఆరోగ్యం కుదుటపడిందని ఈ రోజు డిశ్చార్జ్ కానున్నారని ఆయన కుమారుడు రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ .. సునిశతమైన విమర్శకు ఆధ్యాత్మిక రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వెల్లడించడంలో గొల్లపూడి పెట్టింది పేరని వెంకయ్య అన్నారు. ఆయన త్వరలోనే కోలుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలను పొందాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.