అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియం చేయబోతున్న జగన్ సర్కార్…!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం లో కూర్చున్నాక అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల జీవితాలలో మార్పు వచ్చే విధంగా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. మద్యపానాన్ని అరికడుతూ రాష్ట్రంలో కుటుంబాలు కూలిపోకుండా ఆడపడుచులు కన్నీటి పాలు కాకుండా ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో మద్యపానాన్ని క్రమ క్రమంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాలు కల్పిస్తూ ముందడుగు వేశారు.

గ్రామ సచివాలయాలు గ్రామ వాలెంటర్ల్లు అంటూ అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో ఉన్న విద్యారంగంపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. విద్యా రంగంలో పెను మార్పులు తీసుకురావడానికి జగన్ సర్కారు రెడీ అయినట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది.

ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని విడతల వారీగా ప్రవేశపెట్టాలని చూస్తుంది. 2020-21 సంవత్సరానికి 1 నుండి 8 వ తరగతికి ఇంగ్లీష్ మీడియం అమలు కానుంది, ఆ తరువాతి సంవత్సరానికి అనగా 2021-22 నుండి 9 వ తరగతికి, అలాగే 2022-23 సంవత్సరానికి 10 వ తరగతికి అమలు కానుంది.

అయితే ఈ ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి పై ఐక్య ఉపాధ్యాయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్పందించారు. తెలుగును రద్దు చేయడం సమంజసం కాదని అన్నారు. తప్పనిసరి చేయాలనీ మేము అంటే తీసివేయడం విచారకరం అని అన్నారు. పేద పిల్లలు బడి మానేసే ప్రమాదం ఉందని, విద్యా ప్రమాణాలు పడిపోతాయని అన్నారు. దీంతో జగన్ సర్కార్ ఈ విషయంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకోవడానికి చర్యలు చేపట్టడానికి దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.