మా గెలుపుతోనే బ్రెగ్జిట్‌ సాధ్యం: బ్రిటన్‌ ప్రధాని

వాస్తవం ప్రతినిధి: వచ్చే నెలలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ మెజారిటీ సాధిస్తుందన్న గట్టి నమ్మకం ఏమీ లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలడం(బ్రెగ్జిట్‌) కేవలం ఒప్పందాలతోనే సాధ్యమవుతుందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సస్‌ అన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల కోసం తన ప్రచారం ప్రారంభించినట్టు మీడియాతో తెలిపారు. న సారథ్యంలో మళ్లీ కన్జర్వేటివ్ పార్టీ మెజారిటీతో అధికారంలోకి వస్తేనే జనవరి 31లోగా ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం సాధ్యమవుతుందని జాన్సన్ తెలిపారు. మిగతా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బ్రెగ్జిట్ అంశం ముందుకెళ్లే అవకాశమే ఉండదని, ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సాధించే దిశగా పార్టీ నేతలు పనిచేయాలని జాన్సన్ అన్నారు.