అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో మరో ఎదురుదెబ్బ

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయానికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.ఏదైనా దేశస్థుడు అమెరికాకు వచ్చిన 30 రోజుల్లోపు తనకు ఆరోగ్య బీమా ఉందని నిరూపించుకోవాలని లేని పక్షంలో కొత్త హెల్త్ ఇన్స్‌రెన్సూ పాలసీని తీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీని పై ఏడుగురు అమెరికన్ పౌరులు ఒక ఎన్జీవో కోర్టులో దావా వేశారు. విచారణ సందర్భంగా జడ్జి సైమన్ మాట్లాడుతూ.ఈ నిబంధన అమెరికా వ్యాప్తంగా కుటుంబాలకు నష్టం కలిగిస్తున్నందున నిషేధం ఆమోద యోగ్యమైనదేనన్నారు.

కుటుంబ కేందీకృత ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధ నుంచి అమెరికాను బయటపడేసేందుకే ట్రంప్ ఈ నిబంధన ప్రతిపాదించారు.ఈ హెల్త్‌కేర్ పాలసీపై 28 రోజుల తాత్కాలిక స్టేను విధిస్తూ న్యాయమూర్తి సైమన్ ఆదేశాలు జారీ చేశారు.ఈ నిషేధం నవంబర్ 3 నుంచి అమల్లోకి వస్తుంది.కాగా అమెరికన్ పౌరుల కంటే వలసదారులు ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధను ఉపయోగించుకునే అవకాశం తక్కువగా ఉందని యూఎస్ నిపుణులు చెబుతున్నారు.