చిలీలో ఆందోళనల వెనక విదేశీ హస్తం: అమెరికా అధ్యక్షుడు

వాస్తవం ప్రతినిధి: చిలీలో ఇంధన ధరల పెంపుదలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. గత రెండు వారాలుగా వెల్లువెత్తుతున్న నిరసనలతో 30మందికి పై మృతి చెందారు. వందలాదిమంది గాయపడ్డారు. ఈ ఆందోళనల వెనక విదేశీ హస్తం ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు.సెబాస్టియన్‌ పినేరా నేతృత్వంలోని మితవాద ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు.

నవంబరు16-17 మధ్య జరగాల్సి ఉన్న ఆసియా పసిఫిక్‌ ఆర్థిక సహకార కూటమి (అపెక్‌) శిఖరాగ్ర సమావేశానికి చిలీ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా, దానిని విరమించుకుంటున్నట్లు పినేరా ప్రకటించారు. అలాగే, వచ్చే నెల ఆరంభంలో చిలీ వేదికగా జరగాల్సిన ఐరాస వాతావరణ సదస్సు (సిఒపి-25)ను కూడా ఆయన రద్దు చేశారు.