రజత పతకం నెగ్గిన రెజ్లర్‌ పూజ

వాస్తవం ప్రతినిధి: భారత మహిళా రెజ్లర్‌ పూజా గెహ్లాట్‌ అండర్‌–23 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో శుక్రవారం జరిగిన మహిళల 53 కేజీల ఫ్రీస్టయిల్‌ ఫైనల్లో హరునా ఒకూనో (జపాన్‌) 72 సెకన్లలో పూజాను ‘బై ఫాల్‌’ పద్ధతిలో ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.