కేఏ పాల్ ని టార్గెట్ చేసిన ఆర్జీవీ

వాస్తవం ప్రతినిధి: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఇటీవలే విడుదల అయిన ఈ చిత్ర ట్రైలర్ అందరిని బాగా ఆకట్టుకుందని చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు హడావిడి చేసిన కేఏ పాల్ ని కూడా ఆర్జీవీ వదలలేదు. అయితే కేఏ పాల్ పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు వున్నారు. ఏకంగా పాటనే విడుదల చేసారు.

నేనే కేఏ పాల్ అంటూ సాగె ఈ పాటలో చాల హైలెట్స్ వున్నాయి. అయితే ఆర్జీవీ పై అప్పట్లో కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 2017 లో కలిసాడని, తన కళ్ళకు నమస్కరించాడని ఇంకా చాలానే అన్నారు. అందుకేనేమో ఆర్జీవీ కేఏ పాల్ ని టార్గెట్ చేసారని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.