మా అంతర్గత వ్యవహారాలలో జోక్యం వద్దు..!

వాస్తవం ప్రతినిధి: ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో ఎటువంటి జోక్యాన్నైనా తిరస్కరించాలని భారత్‌, సౌదీ అరేబియా పునరుద్ఘాటించాయి. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం తమ అంతర్గత విషయమని భారత్‌ స్పష్టం చేస్తుండగా, పాకిస్థాన్‌ ఆ అంశాన్ని చైనా సాయంతో పలు అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌, సౌదీలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఆ అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నట్టు తెలుస్తున్నది. ఉభయ దేశాల మధ్య ముఖ్యమైన అంశాలపై సమన్వయం చేసేందుకు ఒక వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు. ఈ మండలికి మోదీ, సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నేతృత్వం వహిస్తారు.