భిన్నత్వంలో ఏకత్వం దేశానికే గర్వకారణం: మోదీ

వాస్తవం ప్రతినిధి: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పటేల్‌ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం (స్టాచు ఆఫ్‌ యునిటీ) వద్ద ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ఏక్‌తా దివస్‌ పరేడ్‌లో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

అనంతరం మోడీ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం దేశానికే గర్వకారణమన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యత కోసం పాటుపడుతున్నారన్నారు. మనల్ని విడగొట్టేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయులను ఎవరూ విడదీయలేరన్నారు. అక్టోబర్‌ 31ని ప్రధాని మోడీ 2014లో ఐక్యతా దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏటా ఐక్యతా పరుగు నిర్వహిస్తున్నారు.