కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన కేటీఆర్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మంత్రి కేటీఆర్ కలిశారు. సౌత్‌బ్లాక్‌లో రాజ్‌నాథ్‌ను కలిసిన కేటీఆర్‌ హైదరాబాద్‌ – నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ – రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రహదారులు రవాణావసరాలకు సరిపోవడం లేదని, ఆయా మార్గాల్లో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున భూముల అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాజ్‌నాథ్‌ను కేటీఆర్‌ కోరారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌తో కలిసి ఉన్న ఫోటోలను కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.