జమ్మూకాశ్మీర్‌లో ట్రక్కు డ్రైవర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

వాస్తవం ప్రతినిధి: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు ట్రక్కు డ్రైవర్లను టార్గెట్‌ చేశారు. అనంతనాగ్‌లో టెర్రరిస్టులు ట్రక్కు డ్రైవర్‌ను కాల్చిచంపారు. రెండు వారాల్లో ఉగ్రవాదులు నలుగురు డ్రైవర్లను హతమార్చారు. ఉగ్రవాదుల చర్యతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.