మూడు రోజుల ముందే వైట్ హౌస్ లో దీపావళి సంబరాలు ప్రారంభం

వాస్తవం ప్రతినిధి: దీపావళి హడావుడి అప్పుడే మొదలైంది. అయితే, మన కంటే ముందే దీపావళి జరుపుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. తన అధికారం నివాసం వైట్ హౌస్ లో ట్రంప్ గురువారంనాడు దీపావళి జరుపుకోనున్నారు. భారత్ లో దీపావళి వేడుకలను జరుపుకోవడానికి మూడు రోజుల ముందే వైట్ హౌస్ లో సంబరాలు జరగనున్నాయి.

2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా వైట్ హౌస్ లో దీపావళి వేడుకలను ప్రారంభించారు. 2017లో భారత సంతతి అమెరికా నేతలతో కలసి ట్రంప్ తొలి సారి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గత ఏడాది దీపావళి వేడుకలకు అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సింగ్ ను ట్రంప్ ఆహ్వానించారు. దీపావళి వేడుకలను ట్రంప్ జరుపుకోనుండటం ఇది మూడోసారి.