నవంబర్ 3 నుంచి భారత్-బంగ్లాదేశ్ ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం

వాస్తవం ప్రతినిధి: నవంబర్ 3 నుంచి భారత్-బంగ్లాదేశ్ ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, ఈ సిరీస్ కు అందుబాటులో ఉండాలో? లేదో? కోహ్లీనే నిర్ణయించుకోవాలని అన్నారు. అన్ని ఫార్మాట్లతో కలిపి గత 56 అంతర్జాతీయ మ్యాచ్ లలో 48 మ్యాచ్ లను కోహ్లీ ఆడాడు. ఈ నేపథ్యంలో, బాంగ్లాదేశ్ తో జరగబోయే టీ20 మ్యాచ్ లకు కోహ్లీ దూరంగా ఉండబోతున్నాడని… ఆ తర్వాత జరిగే టెస్టు మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు గంగూలీ సమాధానమిచ్చారు.