కమల్ తో చేస్తున్న భారతీయుడు 2 సినిమాలో భారీ ఫైట్ ప్లాన్ చేసిన శంకర్..!

వాస్తవం సినిమా: 1996 లో శంకర్ దర్శకత్వంలో కమల హాసన్ హీరోగా వచ్చిన ‘భారతీయుడు’ సినిమా దేశవ్యాప్తంగా మరియు దక్షిణాది సినిమా రంగంలో అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. దేశంలో అవినీతి లేకుండా స్వాతంత్ర సమరయోధుడు పోరాటయోధుడు గా కమలహాసన్ డబుల్ రోల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం మరియు పాటలు ఇప్పటికీ కూడా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమాని మళ్లీ డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ నీ హీరోగా పెట్టి చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. మొన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఈ సినిమాకి సంబంధించిన పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు డైరెక్టర్ శంకర్. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ భారీ ఫైట్ డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తమిళ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. అయితే ఈ భారీ ఫైట్ కోసం ఏకంగా 2 వేల మంది ఫైటర్లతో ఈ సన్నివేశాలను పీటర్ హెయిన్స్ సమక్షంలో శంకర్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో 90 సంవత్సరాలు వయసు కలిగిన పాత్రలో కమలహాసన్ నటిస్తున్నాడు.