బన్నీ పై మండిపడ్డ అభిమానులు..!

వాస్తవం సినిమా: అల్లు అర్జున్ చేసిన చివరి సినిమా నాపేరు సూర్య దారుణంగా ఫ్లాప్ కావడం, పైగా చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు త్రివిక్రమ్ సినిమా అల వైకుంఠ పురంబులో అనే ప్రాజెక్టు ఒప్పుకోవడం జరిగింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక మాస్ సాంగ్ ‘రాములో రాములా’ అనే సాంగ్ రిలీజ్ అవుతుందని ట్విట్టర్ ద్వారా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను ఊరించి రిలీజ్ చేయకపోవడంతో అల్లు అర్జున్ పై తీవ్రంగా సోషల్ మీడియాలో అభిమానులు మండిపడ్డారు.

ఎస్.రాధాకృష్ణ మరియు అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 12వ తారీకు న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాలో ముందుగా సామజవరగమన అనే సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు పెంచేశారు. ఇదే తరహాలో మాస్ సాంగ్ అంటూ అల్లు అర్జున్ ‘రాములో రాములా’ రిలీజ్ అవుతుందని ట్విట్టర్ ద్వారా చెప్పటంతో ఎంతగానో ఆశగా ఎదురుచూశారు అభిమానులు. చివరకు ఊరించి ఊరించి సాంగ్ రిలీజ్ చేయకపోవడంతో తీవ్రంగా నిరాశ చెంది బన్నీ పై మండిపడ్డారు. అక్టోబర్ 21 వ తారీకున సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు విడుదలవుతుందని టైం కూడా బన్నీ చెప్పటంతో సాయంత్రం వరకు వెయిట్ చేసిన అభిమానులు సాంగ్ రిలీజ్ కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో అక్టోబర్ 22 ఓ తారీఖున ‘రాములో రాములా’ సాంగ్ రిలీజ్ అవుతుందని కొన్ని అనివార్య కారణాలవల్ల రిలీజ్ కాలేదని క్లారిటీ ఇచ్చారు ‘అల వైకుంఠ పురంబులో ‘ సినిమా యూనిట్.