బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ లో భాగంగా ఆడిన గేమ్ లో కొట్టుకునే దాకా వెళ్ళిన వరుణ్- రాహుల్..!

వాస్తవం సినిమా: సండే జరిగిన ఎపిసోడ్ లో ఇంటి నుండి వితికా ఎలిమినేట్ కావడంతో…చాలా డల్ అయిన వరుణ్ సందేశ్…సోమవారం జరిగిన ఎపిసోడ్ లో కొంచెం ఎనర్జిటిక్ గానే ఉన్నాడు. ఇంక రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు చూస్తున్న ప్రేక్షకులను బిగ్ బాస్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఆట చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ వారం నామినేషన్ ప్రాసెస్ లో భాగంగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ‘బేటరీ ఉండే నిండుగా.. చేసుకోండీ పండగా’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా ముందుగా శివ జ్యోతి అలీ కు అరటిపళ్ళు టాస్క్ ఇచ్చారు. ఎవరు ఎక్కువ అరటిపళ్ళు తింటారో వారి బ్యాటరీ రీఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టాస్క్ లో అలీ గెలవడం జరిగింది.

అయితే ఆ తరువాత టాస్క్ లో వరుణ్, రాహుల్ ల మధ్య ఫిజికల్ టాస్క్ జరిగింది. ఎవరి బ్యాగ్ లో థెర్మోకోల్ బాల్స్ ఎక్కువ ఉంటాయో వారే గెలిచినట్లు బిగ్ బాస్ చెప్పారు. ఈ ప్రాసెస్ లో రాహుల్, వరుణ్ ఒకరితో మరొకరు ఫిజికల్ గా ఎటాక్ చేసుకున్నారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా టాస్క్ సాగింది కొట్టుకునేంత పని అయింది అయితే చివరాఖరికి టాస్క్ లో రాహుల్ గెలిచారు.