పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు అందుకున్న జార్జిరెడ్డి డైరెక్టర్..!

వాస్తవం సినిమా: తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న జార్జిరెడ్డి జీవిత కథను ఆధారం చేసుకుని ఇటీవల డైరెక్టర్ జీవన్ రెడ్డి “జార్జిరెడ్డి” పేరుతో నేటి తరం తెలంగాణ విద్యార్థులకు అతని కథ తెలిసేవిధంగా సినిమా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైనప్పుడు సినిమా ని పెద్దగా పట్టించుకోలేదు అంచనాలు కూడా లేవు. అటువంటిది ఎప్పుడైతే జార్జిరెడ్డి సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యిందో…సోషల్ మీడియాలో ఈ సినిమా పెద్ద హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు డైరెక్టర్ జీవన్ రెడ్డి పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూశారట దీంతో ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా డైరెక్టర్ జీవన్ రెడ్డి కి ఫోన్ చేసి మాట్లాడారట. అంతేకాకుండా తనను వచ్చి కలవమని చెప్పారట. దీంతో దర్శకుడు బాగా ఎగ్జైట్ అవుతున్నట్లు సమాచారం. పవన్ ఆలోచనలకు, అతడి భావాలకు దగ్గరగా సినిమా ఉండడంతో జీవన్ రెడ్డిని ప్రత్యేకంగా కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడుతున్నట్లు సమాచారం. మొత్తంమీద వీరిద్దరి సమావేశంలో పవన్ కళ్యాణ్ కి అనుగుణంగా ఓ పొలిటికల్ కథ జీవన్ రెడ్డి పవన్ కి చెప్పి ఓకే చూపిస్తే పవన్ సినిమా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.