లండన్ లో సత్తా చాటిన బాహుబలి..!

వాస్తవం సినిమా: తెలుగు సినిమా దమ్ము అంటే ఏంటో దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన సినిమా బాహుబలి 2. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టించి మంచి పేరు సంపాదించింది. ఈ సినిమాకి వచ్చిన ఆదరణ చూసి ప్రధాని మోడీ కూడా బాహుబలి టీమ్ ని తన దగ్గరకు పిలిపించుకుని అభినందించడం జరిగింది. అలాగే ఈ సినిమాకి అనేక అవార్డులు రావటం రికార్డులు సృష్టించడం అందరం చూశాం. ఈ నేపథ్యంలో ప్రపంచ సినిమా రంగంలోనే లండన్ ఆల్బర్ట్ హాల్ అనేది చాలా ప్రత్యేకమైనది. అటువంటి హాల్లో కేవలం ఇప్పటివరకు బాగా పేరుగాంచిన ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే ప్రదర్శితమయ్యాయి. అటువంటి 148 ఏళ్ల ఆల్బర్ట్‌ హాల్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా పరభాష చిత్రం బాహుబలి ప్రదర్శితం కావడం ఇప్పుడు అంతర్జాతీయ సినిమా రంగంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దీంతో బాహుబలి సినిమా లండన్లో కూడా ప్రదర్శితం కావడం తో బాహుబలి సినిమా యూనిట్ పై దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.