జగన్ తీసుకున్న నిర్ణయాలపై భారీ షాక్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ..!

 వాస్తవం ప్రతినిధి: అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ రాష్ట్రంలో ఇసుక ఆపేయటం మనందరం చూస్తూనే ఉన్నాం.

దీంతో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామంది పేదరికం కలిగిన కూలీల జీవితం చిన్నాభిన్నం అవుతుందని లక్షలాది భవన కార్మికుల జీవితాలు చెల్లాచెదురుగా మారుతున్నాయి అంటూ భవన నిర్మాణ కార్మికులకు ఇసుక కొరత వల్ల చాలా నష్టం వాటిల్లిందని ఆ నష్టం ప్రభుత్వమే చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తూ జగన్ ప్రభుత్వం పై అక్టోబర్ 24 వ తారీకున చంద్రబాబు సామూహిక నిరసన దీక్ష చేపట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు రావాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసింది. అంతేకాకుండా అధికారంలోకి వచ్చాక జగన్ ఇస్తున్న హామీలు, చేస్తున్న ప్రకటనలు, పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వ హయం లో ఉంచిన వాటినే వైసీపీ ఇస్తోంది అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు.

మరోపక్క జనసేన పార్టీ కూడా రాష్ట్రంలో ఇసుక ప్రభుత్వం ఆపడం వల్ల చాలా మంది పేద కూలీలు బతకలేక పోతున్న ఈ విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ ప్రభుత్వం పై లాంగ్ మార్చ్ చేయటానికి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సిద్ధమైన విషయం తెలిసిందే. మరి విపక్ష పార్టీలు అన్నీ ఇసుక విషయంలో ఏకమవుతున్న క్రమంలో జగన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.