విశాఖ-చెన్నై కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

వాస్తవం ప్రతినిధి: విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి విశాఖ-చెన్నై విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఈ విమాన సర్వీసులను స్పైస్ జెట్ సంస్థ ప్రారంభించనున్నది.

ఉదయం 6.35 గంటలకు చెన్నైలో బయల్దేరి ఉదయం 8.10గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఉదయం 11.20గంటలకు విశాఖలో బయల్దేరి మధ్యాహ్నం 12.55కు చెన్నై చేరుకుంటుంది. అలాగే విశాఖ – విజయవాడ మధ్య మరో విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. ఉదయం 8.30గంటలకు విశాఖలో బయల్దేరి 9.30గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఉదయం 9.50గంటలకు విజయవాడలో బయల్దేరి 10.50గంటలకు విశాఖ చేరుకుంటుంది.