తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 3 గంటల సమయం

వాస్తవం ప్రతినిధి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం ఒక కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.