అభిమానుల దాహాన్ని తీర్చడానికి మంచి స్కెచ్ వేసిన అల్లు అర్జున్..!

వాస్తవం సినిమా: వరుస ఫ్లాపులతో కెరియర్ మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న సమయంలో ‘నాపేరు సూర్య’ సినిమా తీసి దారుణమైన డిజాస్టర్ చూశాడు అల్లు అర్జున్. దీంతో తర్వాత చేయబోయే సినిమా కోసం చాలా టైం తీసుకున్న అల్లు అర్జున్ గతంలో తనకు రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ‘అల వైకుంఠ పురంబులో’ అనే సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ఓ వెరైటీ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నాడట. స్టోరీ పరంగా చాలా కొత్తదనంతో ఈ సినిమాని త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నారట. కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాకముందే సినిమా లో ‘సామజవరగమన’ అనే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఈ పాటకి మంచి ఆదరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో లభిస్తోంది. అనేక రికార్డులు కూడా సృష్టిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేశారు సినిమా యూనిట్. రిలీజైన పోస్టర్ బట్టి చూస్తే అల్లు అర్జున్ ఒక మాస్ సాంగ్ వెయ్యటానికి క్లాస్ లుక్ లో రెడీ అయినట్లు తెలుస్తుంది. మొత్తంమీద చూసుకుంటే తన అభిమానులకు ఈ సాంగ్ తో అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసి వారి దాహాన్ని తీర్చడానికి మంచి స్కెచ్ అల్లు అర్జున్ రెడీ చేస్తున్నట్లు పోస్టర్ బట్టి అర్థమవుతుంది.