వారిని ఆదుకోండి.. అభిమానులకు రజినీకాంత్ పిలుపు..!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల దక్షిణాది భారతదేశంలో విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో డెంగ్యూ జ్వరాలు ప్రబలమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలలో వర్షాలు విస్తారంగా కురిసిన క్రమంలో జ్వరాలు క్రమ క్రమంగా పెరుగుతుండటంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన రజినీకాంత్ ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క వరుసగా సినిమాలు చేస్తూ అటు తమిళనాడు రాజకీయ నాయకులను ఇటు ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేస్తూ కెరియర్ ని సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో తమిళనాడు రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు బాగా ప్రబలం అవుతున్న నేపథ్యంలో రజనీకాంత్‌ డెంగ్యూ బారి నుంచి ప్రజలను రక్షించడానికి నేలవేమ కషాయాన్ని ఉచితంగా అందించాలని తన ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. నేలవేము కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని దీని వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని డెంగ్యూ కి బాగా పనిచేస్తుంది అంటూ అభిమానులకు తెలియజేస్తూ ఈ కషాయాన్ని అందరికీ ఉచితంగా ఇవ్వాలని రజినీకాంత్ పేర్కొన్నారు. కాగా ఇటీవల మురగదాస్ దర్శకత్వంలో నటించిన దర్బార్ సినిమా షూటింగ్ ముగియడంతో ఈనెల 13వ తారీఖున హిమాలయ కి వెళ్లిన రజినీకాంత్ తిరిగి చెన్నై కి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దర్బార్ సినిమా అద్భుతంగా వచ్చిందని సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అన్నట్టుగా తన ఆధ్యాత్మిక విషయాలు హిమాలయ యాత్ర గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు.