భారీ ఆఫర్లతో జియో మరో సంచలన ప్రకటన

వాస్తవం ప్రతినిధి: భారీ ఆఫర్లతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న జియో.. తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. జియో ‘ఆల్ ఇన్ వన్ ప్లాన్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే ప్లాన్‌తో అపరిమిత సేవలు అందించనుంది. జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లో ప్రతిరోజూ 2జీబీ డాటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జియో పేర్కొంది. ఇతర టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరకు తాము ఉత్తమ సేవలను అందిస్తున్నట్టు జియో చెబుతోంది. బేస్ ప్లాన్‌కు అదనంగా చెల్లించే రూ.111 ప్లాన్‌తో మరో నెల పాటు అపరిమిత సేవలు పొందొచ్చని తెలిపింది. ఇదిలా ఉంటే ఇతర కంపెనీలు రూ.249లతో నెలకు ఇచ్చే సౌకర్యాలను జియో రూ. 222లకే ఇస్తోంది. రెండు నెలల ప్లాన్‌ను ఇతరులు రూ. 500లకు ఇస్తుంటే జియో రూ.333లకే అందిస్తోంది.

ప్రస్తుత జియో 3నెలల ప్లాన్ రూ. 448గా ఉంటే దాన్ని రూ. 444గా మార్చారు. దీంతో అదనంగా వెయ్యి నిమిషాల వాయిస్ కాల్స్(ఇతర నెట్ వర్క్ లకు) పొందొచ్చు. అలాగే రెండు నెలల ప్లాన్ రూ.396 బదులుగా రూ.333 మాత్రమే చెల్లించాలి. దీనిలో కూడా అదనంగా 1000 నిమిషాల వాయిస్ కాల్స్ పొందే అవకాశం ఉంది.