నోటాకి ఓటు వేయొద్దు..దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు : గడ్కరీ

వాస్తవం ప్రతినిధి: నాగ్ పూర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓటు హక్కు వినియోగించుకొని అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ప్రజాస్వామ్య పండుగ. ప్రజలందరూ ఓటు వేసి దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతం చేయాలని కోరుతున్నాను. బీజేపీ, శివసేన, రిపబ్లికన్ పార్టీల కూటమి ఈ ఎన్నికల్లోనూ రికార్డు స్థాయిలో భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో ఫడ్నవీస్ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం చాలా పనులు చేశాయి. నోటాకి ఓటు వేయొద్దు. దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు.