పాకిస్థాన్ ప్రధానికి స్వదేశంలో నిరసన సెగలు

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ ప్రధానికి స్వదేశంలో నిరసన సెగలు తగులుతున్నాయి. కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో ప్రధాని ఇమ్రాన్ విఫలమయ్యారనీ, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత బిల్వాల్ బుట్టో ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలలో రిగ్గింగ్ కు పాల్పడి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యారనీ, ఆయనకు దేశాన్ని పాలించే సామర్ధ్యం కానీ, అర్హత కానీ లేవని బిల్వాల్ భుట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.