ఆ మూడు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించిన చైనా

వాస్తవం ప్రతినిధి: భారత్‌, చైనా, పాకిస్తాన్‌ దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని చైనా ఆకాంక్షించింది. చైనా, భారత్‌లు ఈ ప్రాంతంలో అత్యంత ప్రభావం కలిగిన పెద్ద దేశాలని భారత్‌లో చైనా రాయబారి సూన్‌ వీడాంగ్‌ అన్నారు. ఇద్దరు నేతలు (చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, భారత ప్రధాని మోడీ) ఈ ప్రాంత పరిస్థితులపై ఎంతో లోతైన అవగాహన కలిగిన వారని ఆయన అన్నారు. చైనా – భారత్‌, చైనా – పాకిస్తాన్‌, భారత్‌ – పాకిస్తాన్‌ దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని చైనా కోరుకుంటున్నదని ఆయన చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ధికి, పురోగతికి, సుస్థిరతకు, శాంతికి ఈ దేశాలు కలిసికట్టుగా పని చేస్తాయని తాము ఆశిస్తున్నామని వీడాంగ్‌ చెప్పారు.