ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక మసీదులో రెండు పేలుళ్లు..18 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్‌ ప్రొవిన్స్‌లో ఒక మసీదులో రెండు పేలుళ్లు సంభవించాయి. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 18 మంది మరణించారు. మరొక 50 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. పేలుళ్లకు తామే కారణమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు.