భారీ వర్షంలో తడుస్తూ వేదికపై ప్రసంగాన్ని కొనసాగించిన శరద్‌ పవార్‌

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ముమ్మరంగా పాల్గొంటున్నారు. సతారాలో ఎన్నికల ప్రచారంలో శరద్‌ పవార్‌ మాట్లాడుతుండగా వర్షం కురిసింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఆయన వేదికపై నిలబడి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయనతోపాటు వేదికపై ఇతర నేతలు కూడా వర్షంలోనే నిలబడ్డారు. ప్రజలు దీనిని ఆసక్తిగా గమనించారు.