సౌదీ అరేబియాలోఘోర రోడ్డు ప్రమాదం.. 35 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 మంది విదేశీయులు మృతి చెందారు. మరొక నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న బస్సు మదీనా ప్రాంతంలోని అల్‌అఖల్‌ సెంటర్‌లో ఒక భారీ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెప్పారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.