ఘోర ప్రమాదం..వంద మందికి పైగా సజీవదహనం

వాస్తవం ప్రతినిధి: ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బహ్రెయిన్ లోని కర్మాగారంలో చోటు చేసుకున్న భారీ ప్రమాదంలో వంద మందికి పైగా సజీవదహనమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న వారు అక్కడిక్కడే కాలి బూడిద అయ్యారట. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఈ ఘోర అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన కార్మికుల్లో వందకు పైగా భారత కార్మికులు ఉన్నట్ళు సమాచారం. వీరిలో పాతిక మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా చెబుతున్నారు. సజీవ దహనమైన పాతిక మందిలో పదిహేను మంది వరకూ నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం ఇంకా అందాల్సి ఉంది.