భారత గగనతలంలో చక్కర్లు కొట్టిన పాక్‌ డ్రోన్‌

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. పంజాబ్‌లోని పాక్‌ సరిహద్దు సమీపంలో ఆ దేశానికి చెందిన డ్రోన్‌ చక్కర్లు కొట్టింది. హజారాసింగ్‌ వాలా, బక్డీ ప్రాంతంలో పాక్‌ డ్రోన్‌ కనపడిందని గ్రామస్థులు చెప్పారు. అది పాక్ నుంచి భారత గగనతలంలోకి వచ్చిందని తెలిపారు. బీఎస్‌ఎఫ్‌ హెచ్‌కే టవర్‌ సమీపంలో పంట పొలాల మీదుగా దాదాపు ఒక కిలోమీటరు వరకు ఇది దూసుకొచ్చిందని అధికారులు వివరించారు. అయితే, కాసేపటికే ఆ డ్రోన్ కనపడకుండా పోయిందని తెలిపారు.