హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగుతున్న బాలకృష్ణ

వాస్తవం ప్రతినిధి: హుజూర్ నగర్ ఉపఎన్నిక పోలింగ్ ఈనెల 21 న జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీడీపీ తరపున నందమూరి బాలకృష్ణ ప్రచారం చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. అదే రోజున బాలయ్య కూడా ప్రచారం చేయబోతున్నట్టు సమాచారం. మరోవైపు, 18, 19 తేదీల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇప్పటికే ప్రచారం చేశారు.