పాకిస్థాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టడానికి సిద్దమైన ఎఫ్ఏటీఎఫ్

వాస్తవం ప్రతినిధి: ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్థాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందే మార్గాలను నిరోధించే ఎఫ్ఏటీఎఫ్.. ఫ్రాన్స్ వేదికగా పనిచేస్తుంది. ప్రస్తుతం ప్యారిస్ లో ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో పాక్ కు ఒక్క సభ్య దేశం కూడా మద్దతు ఇవ్వలేదు. గతంలో ఈ సంస్థ పాక్ ను గ్రే లిస్టులో పెట్టి, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకోసం మొత్తం 27 సిఫార్సులు చేయగా, వాటిలో పాక్ ఆరింటిని మాత్రమే అమలు చేసింది. దీంతో ఆ దేశాన్ని డార్క్ గ్రే లిస్టులో పెట్టాలని ఎఫ్ఏటీఎఫ్ భావిస్తోంది.