టైఫూన్‌ హాగిబిస్‌ కారణంగా 66కు పెరిగిన మృతుల సంఖ్య

వాస్తవం ప్రతినిధి: జపాన్‌ను కుదిపేసిన టైఫూన్‌ హాగిబిస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 66కు పెరిగింది. సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. ధ్వంసమైన ఇళ్లు, బురద మధ్యలో వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ 15 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని జపాన్‌ జాతీయ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కె వార్త ప్రసారం చేసింది. 200 మందికి పైగా గాయపడ్డారు.