సతీసమేతంగా నోబెల్ కు ఎంపికైన ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ

వాస్తవం ప్రతినిధి: ఆర్థిక రంగంలో ముగ్గురికి సంయుక్తంగా నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. అభిజిత్‌ బెనర్జీ, ఎస్తర్‌ డఫ్లో, మైకేల్‌ క్రెమెర్‌లకు సంయుక్తంగా నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. ప్రపంచ పేదరికాన్ని తొలగించడానికి వారు చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్‌ బహుమతిని ప్రకటించారు.

కాగా అభిజిత్ బెనర్జీ స్వస్థలం కోల్ కతా కాగా అమెరికాలోని ఎంఐటీలో ఎకనామిక్స్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆర్థికశాస్త్రం-పేదరికంపై తన భార్య ఎస్తర్‌ డఫ్లోతో కలిసి ఎంతగానో కృషి చేశారు. దీనికి గాను భార్య ఎస్తర్ డఫ్లో, మైకేల్ క్రెమెర్ లతో కలిపి నోబెల్ ప్రకటించారు. కేవ‌లం రెండు ద‌శాబ్ధాల్లోనే ఈ ముగ్గురు ప్రతిపాదించిన ప‌రిశోధ‌నా సిద్ధాంతాలు ఆర్థిక‌వ్యవ‌స్థను మార్చేశాయ‌ని, ఈ ముగ్గురు ప్రతిపాదించిన సిద్దాంతం చిన్న చిన్న ప్రశ్నల‌తో కీల‌క స‌మాచారాన్ని సేక‌రించే విధంగా చేసింద‌ని కమిటీ పేర్కొంది.