జపాన్‌లో ‘హాగిబిస్‌’తుపాన్‌ భీభత్సం..11 మంది మృతి

వాస్తవం ప్రతినిధి:  జపాన్‌ను హాగిబిస్‌ తుపాన్‌ కుదిపేసింది. భీకర వర్షంతో ఏర్పడిన వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకూ 11 మంది మరణించారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. జపాన్‌ సైన్యం సహాయక చర్యలు చేపట్టి వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మధ్య జపాన్‌లోని నగానో నగరం భారీగా వరద ముంపునకు గురైంది.

  చికుమా నది పొంగి పొర్లడంతో నగరంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. 427 ఇళ్లలోని వారిని ఖాళీ చేయాలని, 1417 మంది వ్యక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశామని యనాగో నగరం ఎమర్జెన్సీ అధికారి యసుహిరో యమగుచి చెప్పారు. సైన్యం సహాయక చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు.