చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకొని సింగపూర్‌లో దాచుకున్నారు: జోగి రమేశ్‌

వాస్తవం ప్రతినిధి: చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకొని సింగపూర్‌లో దాచుకున్నారని ఎమ్మెల్యే జోగి రమేశ్‌ విమర్శించారు. చంద్రబాబు మానసిక రోగిలా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ రోజు అమరావతిలో ఆయన మాట్లాడుతూ యనమల, దేవినేని, సోమిరెడ్డి కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్నారు. మద్యం షాపులు తగ్గిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు.